థియేటరే ముద్దు: ఆర్. నారాయణమూర్తి

100
narayanamurthy
- Advertisement -

ఓటీటీ వద్దు థియేటరే ముద్దు అన్నారు సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. మీడియాతో మాట్లాడిన ఆర్ నారాయణమూర్తి..అందరు సినిమాలు చూడాలంటే థియేటర్లు తెరచుకోవాల్సిందేనని తెలిపారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు.

ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే చూడగలిగారని వెల్లడించారు. కరోనా కు సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే, ప్రభుత్వాలు థియేటర్లు నడపడానికి అనుమతి ఇవ్వాలని, అలానే సినిమా రంగంలోని పెద్దలు మొదట భారీ చిత్రాలను, క్రేజ్ ఉన్న సినిమాలను విడుదల చేస్తే జనం ధైర్యంగా థియేటర్లకు వస్తారని తెలిపారు.

టక్ జగదీశ్, లవ్ స్టోరీ, విరాట పర్వం వంటి సినిమాలు థియేటర్లలోనే విడుదల కావాలని, త్వరలోనే తన ‘రైతన్న’ సినిమానూ థియేటర్లలోనే విడుదల చేస్తానని ఆర్. నారాయణమూర్తి చెప్పారు.

- Advertisement -