నీటిని ఇలా తాగితే.. ఎంత ప్రమాదమో తెలుసా?

48
- Advertisement -

సమస్త జీవరాశికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సృష్టి మనుగడ అంతా నీటిపైనే ఆధారపడి ఉంది. ఇక మానవుని శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. అందువల్ల తగినంతా నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. సాధారణంగా మనిషి ప్రతిరోజూ 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడంవల్ల శరీరానికి కావల్సిన నీరు అందుతుంది. తగిన మోతాదులో నీరు త్రాగడం వల్ల శరీరానికి కావల్సిన అన్నీ అవసరాలను తీరుస్తుంది. ఎలక్ట్రోరైట్ లను యాక్టివ్ చేయడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా కీళ్ళల్లో ద్రవం, జిగురు తగ్గిపోకుండా చూస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరుస్తుంది. అంతే కాకుండా రక్తకణాలను వృద్ధి పరుస్తుంది. శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా నీరు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్న నీరు.. మన శరీనికి కీడును కూడా చేస్తుందని మీకు తెలుసా ! అయితే మన శరీరానికి నీరు ఎంత అవసరమే.. ఆ నీరును ఏవిధంగా తాగుతున్నామనేది కూడా చాలా అవసరం.. ఎలా పడితే అలా నీరు త్రాగడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు మన శరీరంపై పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిలబడి నీటిని వేగంగా తాగడం వల్ల అజీర్తి, కీళ్లనొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇక నీరు త్రాగే సమయంలో ప్రవాహ వేగం అధికంగా ఉంటే దాని ప్రభావం ఊపిరితిత్తులకు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది నీటిని వంగి తాగడం, లేదా పడుకొని తాగడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదట. ముఖ్యంగా నీరు త్రాగేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచి నెమ్మదిగా నీరు త్రగాలని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది వేగంగా పరుగెత్తిన తరువాత వెంటనే నీటిని తాగుతూఉంటారు.. ఇలా చేయడం వల్ల బ్లేడ్ ప్రజర్ పెరిగిపోయి కార్డియాకరెస్ట్ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పరుగెత్తిన తరువాత కొంత విశ్రాంతి తీసుకొని ఆ తరువాత నెమ్మదిగా కొద్ది కొద్ది గా నీళ్ళు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నీరు త్రాగడం శరీరానికి ఎంత అవసరమో.. ఆ నీటిని సరైన విధంగా తాగడం కూడా అంతే అవసరం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -