ఈ చిట్కాలతో తెల్లజుట్టుకు చెక్!

35
- Advertisement -

నేటిరోజుల్లో తెల్ల జుట్టు అనేది ఏ వయసు వారికైనా సాధారణ సమస్యగా మారిపోయింది. పూర్వంలో వృద్దప్య వయసులో మాత్రమే కనిపించే తెల్లజుట్టు ఇప్పుడు యుక్త వయసు వారిలో కూడా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే పదేళ్ళ లోపు పిల్లలను కూడా ఈ తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. మరి దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం, హార్మోన్ల లోపం వంటివి చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్యను తగ్గించేందుకు రకరకాల మెడిసన్స్ వాడుతుంటారు చాలమంది. ఇంకా మార్కెట్లో దొరికే ఇతరత్రా క్రిమ్స్, హెయిర్ కలర్ వంటివి యూస్ చేస్తుంటారు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యకు ఇంటి చిట్కాలతోనే చక్కటి పరిష్కారం లభిస్తుంది. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

కరివేపాకు
జుట్టుకు సంబందించిన ఎలాంటి సమస్యలకైనా కరివేపాకు చక్కగా పని చేస్తుంది. కరివేపాకులో విటమిన్ ఏ మరియు సి వంటి వాటితో పాటు బి6, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును కుదుళ్ల వరకు బలంగా ఉంచడంలో సహాయ పడతాయి. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి కాస్త మరిగించి అవి నల్లబడన తరువాత వడగట్టి ఆ నూనెను జుట్టుకు 15 నిముషాల పాటు మర్ధన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ఉసిరి
ఉసిరి కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలోనూ చుండ్రు సమస్యలను తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి వాటిని కొబ్బరి నూనెలో మరిగించాలి. నూనె చల్లారిన తరువాత వడగట్టుకొని ఆ నూనెతో జుట్టుకు మర్ధన చేయాలి. ఇలా ప్రతిరోజూ వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలం పొందుతుంది. ఇంకా జుట్టు రాలే సమస్య తగ్గడంతో తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది.

Also Read:బొప్పాయి తింటే గర్భం పోతుందా?

సొరకాయ
జుట్టుకు బలాన్ని పెంచడంలో సొరకాయలో ఉండే పోషకాలు కూడా ఎంతగానో ఉపయోగ పడతాయి. తాజా సొరకాయను పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వారం రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. ఆ తరువాత ఒక పాత్రలో కొబ్బరినూనె తీసుకొని అందులో ఈ ఎండు సొరకాయ ముక్కల్ని వేసి మరిగించాలి. నూనె చల్లారిన తరువాత వడబోసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు జుట్టుకు అప్లై చేసుకొని ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మరి బలంగా తయారవుతుంది.

Also Read:IND VS WI 3rd ODI:సిరీస్ భారత్‌దే

- Advertisement -