అందం పెంచుకోవాలా.. ? ఐతే ఇది మీ కోసమే

30
- Advertisement -

ఈ కాలంలో విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం, పైగా మారుతున్న ఆహారపు అలవాట్లు, దీనికితోడు నిద్రలేమి.. ఇలా ఇవన్నీ మన చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ముఖం పై బాగా ప్రభావం చూపిస్తాయి. సహజసిద్ధమైన అందాన్ని దూరం చేస్తాయి. పైగా ముఖంపై ముడతలు రావడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి.

మరి మీకు తెలుసా?, ఈ సమస్య నుంచి బయట పడడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం రండి.

ముందుగా అల్లం. అవును, అల్లం ముఖంపై ఉన్న ముడతలను బాగా తొలగిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మానికి మేలు చేస్తాయి. అందుకే అల్లం ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖ సౌందర్యాన్ని అల్లం చాలా బాగా పెంచుతుంది..

అలాగే మరో చక్కని చిట్కా నెయ్యి. ఆయుర్వేదంలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే నెయ్యి చర్మ నిగారింపుకి సూపర్‌ ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇందులోని పోషకాలు చర్మానికి పోషణనిస్తాయి. విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్స్ సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. పెదాలను మృదువుగా మారుస్తుంది. నల్ల వలయాలు తొలగిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం ముడతలను తొలగించి ముఖాన్ని యవ్వనంగా మారుస్తాయి.

Also Read:ప్రధాని మోదీపై సీపీఐ నారాయణ ఆగ్రహం

ఇక మరో అద్భుతమైన చిట్కా.. వెల్లుల్లి. ఏమిటి షాకింగ్ గా ఉంది కదా. నిజమే నండి. వెల్లుల్లి వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌తో పాటు అందానికి కూడా ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్తున్నారు నిపుణులు. వ‌య‌సుకు సంబంధించిన ముడత‌లు, చార‌లను నివారించ‌డంలో వెల్లుల్లి బాగా ప‌ని చేస్తుంది. ఒక గుడ్డులోని తెల్ల‌సొన‌, 5 చుక్క‌ల ఆల్మండ్ ఆయిల్, 2 ఎండిన వెల్లుల్లి రెబ్బ‌ల పొడిని తీసుకుని బాగా మిక్స్ చేసి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి ఆరిన త‌ర్వాత నీటితో క‌డిగితే చ‌ర్మం తాజాగా ఉంటుంది. కాబట్టి.. ఈ చిట్కాలు ఫాలో అయ్యి, మీ అందాన్ని పెంచుకోండి.

Also Read:ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్..

- Advertisement -