ఉదయం పూట తప్పక వేయాల్సిన ఆసనాలు!

68
- Advertisement -

నేటి రోజుల్లో వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే గంటల తరబడి కూర్చొని పని చేయడంవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక అరగంట వ్యాయామం చేయడం ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాయామం చేయలేని వారికి యోగా చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అయితే యోగాలో కూడా కష్టతరమైన ఆసనాలు, సులభతరమైన ఆసనాలు రెండు ఉన్నాయి. అయితే అన్నీ యోగాసనాలు ప్రతిరోజూ చేయడానికి వీలు పడదు కాబట్టి.. కచ్చితంగా ప్రతిరోజూ ఉదయం పూట తప్పక వేయాల్సిన ఆసనాల గురించి తెలుసుకుందాం !

భుజంగాసనం
ఈ ఆసనం ప్రతిరోజూ ఉదయాన్నే వేయడం వల్ల మల మూత్ర సమస్యలు తగ్గిపోతాయి. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఈ ఆసనం ఉదర భాగాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది. అలాగే జీర్ణ క్రియ మెరుగుగుపడుతుంది. ఈ ఆసనం వేయడం కూడా ఎంతో సులభం. ముందుగా యోగా మ్యాట్ పై బోర్లా పడుకొని తల నుంచి నడుము భాగం వరకు పైకి లేపాలి. చేతులపై అధిక ఒత్తిడి ఉంచుతు తలను వెనుకకు వంచి శ్వాస క్రియ జరిగించాలి.

పవనముక్తసనం
ఉదయం పూట తప్పక వేయాల్సిన ఆసనాలలో పవనముక్తాసనం కూడా ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల మలబద్దక సమస్య దూరం అవుతుంది. ఉదర కండరాలను శక్తివంతంగా మార్చడంలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఆసనంలో వెల్లకిల పడుకొని కాళ్ళను పైకెత్తి మోకాళ్ళ వరకు మడిచి ఛాతీ వరకు తీసుకురావాలి. ఆ తరువాత తల నుంచి ఛాతీ భాగాన్ని మోకాళ్ళకు ఆనించి రెండు చేతులతో మోకాళ్ళను పట్టుకోవాలి. ఇలా వీలైనంతా సేపు ఉండి తరువాత యథాస్థితికి రావాలి.

అర్థ మత్స్యెంద్రాసనం
ఈ ఆసనం కూడా పూట వేస్తే ఎన్నో ప్రయోజనలు కలిగుతాయి. ముఖ్యంగా బద్దకం సమస్య తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. పిరుదుల భాగంలోని కొవ్వు కరిగిపోతుంది. ఉదర కండరాలు శక్తినొందుతాయి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆసనంలో వెన్నెముక ఒంచకుండా నిటారుగా కూర్చొని ఎడమ కాలును కుడి కాలు తొడల భాగం వెలుపల ఉంచి ఆ కాలుని కుడి చేతితో పట్టుకొని ఎడమ వైపుగా తలతో పాటు శరీరాన్ని తిప్పి, ఎడమ చేతిని నేలకు ఆంచాలి.

Also Read:ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

- Advertisement -