వారికి పెళ్ళి కాలేదు. కానీ.. శోభనం చేసుకుంటున్నారు. అదేమంటే…ఒకరొకొకరు అర్థం చేసుకోవడం అంటున్నారు. ఇలా అక్కడ మాత్రమే కాదు..అన్ని చోట్లా జరుగుతోంది. కాకపోతే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. అయితే..దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు . లివింగ్ టుగెదర్ అనే పేరుతోనో లేక ప్రేమలో ఉన్నామనో, ఇంకా బాగా అర్ధం చేసుకోవాలనే పేరుతోనో, పెళ్ళికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు పలువురు జంటలు .
అయితే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక పెళ్లి పీటల వరకు కొన్ని జంటలు మాత్రమే చేరితే.. మిగతా జంటలన్నీ బ్రేకప్ అంటూ విడిపోతున్నాయి . ఇక విడిపోవడం మాట ఎలా ఉన్నప్పటికీ పెళ్ళికి ముందు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇదే సంఘటన జరిగింది . ఓ రెండు హోటల్ లలో జంటగా అమ్మాయిలు , అబ్బాయిలు రావడం బాగా అర్ధం చేసుకోవాలి అంటూ మనసు ని కాకుండా శారీరక కామ వాంఛ తీర్చుకోవడం కామన్ గా జరుగుతోంది.
ఈ విషయం పోలీసులకు కూడా తెలుసట కానీ ఇన్నాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇంకా రెచ్చిపోయారు యువత . అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ కి యోగి ముఖ్యమంత్రి కావడంతో ఎటువంటి అసాంఘిక చర్యలు జరిగిన ఉపేక్షించేది లేదని గట్టిగా చెప్పడంతో పోలీసులు రెండు హోటల్లపై దాడి చేసి యాభై మంది యువతీయువకులను అరెస్ట్ చేసారు. ఇప్పుడీ ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.