‘మా’కు ప్రకాష్‌ రాజ్ ప్యానల్ రాజీనామా లెటర్‌..

17
Prakash Raj

అక్టోబర్‌ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్‌ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ ఓ లెటర్‌ను ‘మా’కు అందించారు. అందులో పలు ఆస్తికరమైన విషయాలను పేర్కొన్నారు..

సర్, ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో శ్రీ నరేష్ గారు “మా” అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, “మా” కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు, జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారు. ఇపుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుద్దేమో అనే సంశయంతో ఉన్నాం. ఈసారి జరిగిన ఎలక్షన్స్‌లో శ్రీ విష్ణు గారి ప్యానల్ నుండి కొందరు, శ్రీ ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్ నుండి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది, సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము అడగకుండా ఉండలేము. అందుకని “మా” సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము “మా” పదవులకు మనసా వాచా కర్మణా, రిజైన్ చేస్తున్నాం. అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తులో “మా” లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం.. అని లెటర్ లో తెలిపారు.