టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..

17

సీఎం కేసీఆర్ సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు శోభన్ రెడ్డి, భూమరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. పార్టీల చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో గంగారెడ్డి కాంగ్రెస్, నిమ్మల చిన్నారెడ్డి బీఎస్పీ, లింబాద్రి బీఎస్పీ, బీజేపీ నుంచి సురేష్, ప్రవీణ్, శ్రవణ్, వినయ్ వినీత్ , మధు, లక్ష్మణ్‌ నవీన్, రాజేష్, దీక్షిత్ ఉన్నారు.