ఆరోపణలు నిరూపిస్తే..అసెంబ్లీకి రాను:హరీష్

27
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇరిగేషన్ పై విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడగా ఉందని, అది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం అన్నారు. మిడ్ మానేరు కనుక ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. భవిష్యత్తులో అసెంబ్లీకి రాను అంటూ సవాల్ విసిరారు.

ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం కంటే ముందు లెక్కలు కూడా ఖర్చు పెట్టారా అంటూ కాంగ్రెస్ శ్వేతపత్రంపై ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేఆర్ఎంబీ, కేంద్రానికి ఫిర్యాదు చేశామని అన్నారు.ఏమి పనులు చేయకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అంచనాను 35వేల కోట్ల అంచనా పెంచారు. ఒక్క ప్రాజెక్ట్ కు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేశారంటూ ఫైర్ అయ్యారు.

Also Read:పిక్ టాక్ : ఉఫ్.. థైస్ తో ఫుల్ గ్లామర్ డోస్

- Advertisement -