మహానటి శ్రీదేవి, బోనీకపూర్‌ల వివాహం వివాదాస్పద పరిస్థితుల్లో జరగింది. వీరిద్దరికీ ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నప్పుడు బోనీకపూర్ వివాహితుడు. అయితే వీరిద్దరికీ వివాహం కాకుండానే శ్రీదేవి గర్భం దాల్చింది. ఇదిలావుండగా పెళ్లికాక ముందు బోనీ కపూర్ కు శ్రీదేవి రాఖీ కట్టిందనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అసటు విషయానికొస్తే.. బోనీ కపూర్ కన్నా ముందు మిథున్ చక్రవర్తిని ప్రేమించింది శ్రీదేవి. అయితే, బోనీ కపూర్ కు, శ్రీదేవికి మధ్య ఏదో ఉందనే అనుమానం మిథున్ కు కలిగింది. దీంతో, ఆమె చేత బోనీకి రాఖీ కట్టించారట.
శ్రీదేవి కూడా తన ప్రేమ కోసం బోనీకి రాఖీ కట్టారట. ఆ తర్వాత కాలంలో శ్రీదేవి, మిథున్ ల ప్రేమాయణం ముగిసిపోయింది. అప్పటికే బోనీ కపూర్ వివాహితుడు. ఇదే సమయంలో శ్రీదేవితో అఫైర్ నడిపాడు బోనీకపూర్. ఫలితంగా పెళ్లి కాకుండానే శ్రీదేవి గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో, వివాదాస్పద పరిస్థితుల మధ్య బోనీకపూర్, శ్రీదేవి 1996, జూన్ 2న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈవిషయాన్ని కొంతకాలం రహస్యంగా వుంచారు. ఆరు నెలల తర్వాతే ఈ విషయం బయటకు తెలిసింది. వీరిద్దరికి 1997లో జాన్వీ, 2000లో ఖుషి, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.