మరో ఏడాది ముగుస్తోంది. టాలీవుడ్ కు మిశ్రమ అనుభవాలను ఇచ్చిన 2017 ఒకటి రెండు పెద్ద సినిమాలకు తప్ప చిన్నసినిమాలకు మాత్రం మంచి వసూళ్ళను సాధించి పెట్టింది. బాహుబలి 2 వంటి అత్యంత భారీ చిత్రం, స్పైడర్ వంటి భారీ బడ్జెట్ సినిమా, జై లవకుశ వంటి భారీ అంచనాలున్న సినిమాలు వచ్చిన సంవత్సరం ఇది. చిన్నవీ పెద్దవీ కలుపుకుంటే దాదాపు రెండు వందల సినిమాల వరకూ విడుదలయ్యాయి.
బాహుబలి సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ సత్తాని చూపించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సంవత్సరం (2017) రాజమౌళి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిది. ఎందుకంటే..భారతీయ పరిశ్రమలోనే అత్యంత భారీ విజయం అందుకున్న ‘బాహుబలి 2’ సినిమా దర్శకుడిగా ఆయనకు ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇక దాదాపు పుష్కరకాలం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య, జై లవకుశతో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెప్పించగా భారీ బడ్జెట్ మూవీతో తెరకెక్కిన మహేష్ స్పైడర్ మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది.
అర్జున్ రెడ్డి, మెంటల్ మదిలో,ఫిదా,పీఎస్‌వీ గరుడవేగ,శతమానం భవతి,ఆనందో బ్రహ్మా లాంటి చిత్రాలు సర్ ప్రైజ్ హిట్‌ని సొంతం చేసుకున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకమే. రివ్యూలు, రేటింగుల్లో ఈ సినిమాలు చాంపియన్‌గా నిలిచాయి. విడుదలకు ముందు నుంచినే ప్రివ్యూ షోలతో సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు దర్శనమిచ్చాయి.దీంతో చిన్న సినిమాలు వచ్చిన పలు సినిమాలకు 2017లో కలెక్షన్ల వర్షం కురిపించాయి.
కొన్ని కొన్ని చేదు అనుభవాలూ లేకపోలేదు.. తీవ్రంగా నిరాశ పరిచిన సినిమాలూ వచ్చాయి. మొత్తంగా 2017 చాలనిపించే స్థాయిలో ప్రేక్షకులను ఆనంద పెట్టింది.