దిల్ రాజుదే…2017

199
Dil Raju record in 2017
- Advertisement -

సక్సెస్‌ఫుల్ మూవీస్‌కి చిరునామాగా నిలిచిన నిర్మాత‌ దిల్ రాజు. కేవ‌లం నిర్మాణరంగానికే ప‌రిమితం కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ సత్తాచాటారు. దిల్ రాజు నిర్మాతగా సినిమా వస్తుందంటే అందులో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. ప్రేక్షకుల మెప్పు పొందాల్సిందే. ఈ ఏడాది శతమానం భవతితో మొదలైన దిల్ రాజు విజయాల పరంపర ఎంసీఏ సినిమా హిట్‌తో డబుల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకొనున్నాడు.

2017 దిల్ రాజుకు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్‌ విజయాలకు సెంటిమెంట్‌గా మారిన సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి దిల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

ఆ తర్వాత ‘నేను లోకల్’ మరో కమర్షియల్ హిట్ గా నిలిచింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాతో రాజుకు కనకవర్షం కురిపించింది. ఆ తర్వాత వచ్చింది ‘డీజే’ ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినా కమర్షియల్ గా మాత్రం మంచి వసూళ్లను సాధించుకుంది. ఆపై వచ్చిన ‘ఫిదా’తో రాజు సంచలన విజయాన్ని నమోదు చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇక చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సైతం వసూళ్ల జోరు చూపించింది. రవితేజను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఈ సినిమా ఈ ఏడాది దిల్ రాజుకు ఐదో విజయాన్ని అందించింది. తాజాగా ఇప్పుడు ఎంసీఏతో వస్తున్న దిల్..ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాడు. నాని-సాయిపల్లవి జంటగా తెరకెక్కిగా ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ సినిమా హిట్‌తో దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకొనున్నాడు.

- Advertisement -