పాన్-ఇండియన్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ అయింది. ‘రాం సీతా రాం’ అంటూ సాగిన ఈ వీడియో పాట ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతో బాగా ఆకట్టుకుంది. ‘నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సిది రాజభవనంలో’ అని సీత పాత్రధారి కృతీ సనన్ తో రాముడు పాత్రధారి ప్రభాస్ చెబితే.. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలివెళ్తుందేమో.. ఈ జానకి వెళ్లదు’ అని కృతీ సనన్ బదులివ్వడం చాలా బాగా ఆకట్టుకుంది.
అనంతరం ‘ఆదియు అంతము రాముడిలోనే.. మా అనుబంధం రాముడితోనే’ అంటూ మొదలైన పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. అలాగే ఈ పాటలో డిజైన్ చేసిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి రాముడి – సీత పాత్రల మధ్య బంధాన్ని ఈ పాట రూపంలో అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్, పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.
కాగా, జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు. అనంతరం నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డు చేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారు. ఈ మోషన్ కాప్చర్ విధానం ద్వారా సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ హై-బడ్జెట్ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తీసినట్లు తెలస్తోంది.
The soul of Adipurush
Ram Siya Ram
రాం సీతా రాం
राम सिया राम
ராம் சீதா ராம்
ರಾಮ್ ಸೀತಾ ರಾಮ್
റാം സീതാ റാം#RamSiyaRam full song out now – https://t.co/jCXbmAjkEo#Adipurush in cinemas worldwide on 16th June #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar… pic.twitter.com/QipGKUmgba— UV Creations (@UV_Creations) May 29, 2023

