ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!

37
- Advertisement -

ప్రతివారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ లో చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ప్రేక్షకులు కూడా ప్రతి వారం థియేటర్స్ అండ్ ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

Also Read:హరి హార వీరమల్లు సెట్స్‌లో అగ్నిప్రమాదం!

అహింస :

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘నేను స్టూడెంట్‌ సార్‌!’ :

బెల్లంకొండ గణేష్‌ హీరోగా వస్తోన్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్‌ సార్‌!’. ఈ చిత్రాన్ని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్‌వర్మ నిర్మాత. ఈ సినిమా కూడా జూన్‌ 2న థియేటర్లలోకి రాబోతుంది.

‘ఐక్యూ’ :

సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించిన చిత్రం ‘ఐక్యూ’. ఈ సినిమా కూడా జూన్‌ 2న విడుదల కానుంది.

‘పరేషాన్‌’ :

తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘చక్రవ్యూహం’ :

అజయ్‌ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్‌ తెరకెక్కించిన చిత్రం ‘చక్రవ్యూహం’. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కాబోతుంది.

Also Read:తెలంగాణ…ఆవిర్బావం ప్రత్యేకం

ఇక ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే..

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

ఫేక్‌ ప్రొఫైల్‌ (వెబ్‌సిరీస్‌) మే 31వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఎ బ్యూటిఫుల్‌ లైఫ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

న్యూ ఆమ్‌స్టర్‌ డామ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇన్ఫినిటీ స్టోర్మ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్కూప్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మ్యానిఫెస్ట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ 5 లో ప్రసారాలు ఇవే :

విష్వక్‌ (తెలుగు) జూన్‌ 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

సులైకా మంజిల్‌ (మలయాళం) మే 30వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 2వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమాలో ప్రసారాలు ఇవే :

అసుర్‌ 2 (హిందీ సిరీస్‌) జూన్‌ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -