ఈటెల మౌనం.. ఎందుకోసం ?

62
- Advertisement -

తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేందర్ గత కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. బీజేపీ కార్యకలాపాలకు, పార్టీ అంతర్గత విషయాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాకపోవడంతో బీజేపీ విషయంలో ఈటెల ఏం ఆలోచిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాగా ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరినప్పటి నుంచి మునుపటి స్థాయిలో యాక్టివ్ గా కనిపించడం లేదు. బి‌ఆర్‌ఎస్ ( అప్పటి టి‌ఆర్‌ఎస్ ) లో ఉన్నప్పుడూ ఆయన ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించే వారు. కానీ బీజేపీలో చేరిన తరువాత కాషాయ అధిష్టానం ఈటెలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది జగమెరిగిన సత్యం.

తూ తూ మంత్రంగా చేరికల కమిటీ చైర్మెన్ బాధ్యతలు అప్పగించినప్పటికి అది పెద్దగా ప్రాధాన్యం లేని పదవి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ పదవి విషయంలో కూడా ఈటెల సంతృప్తి కనబరచలేదనేది మొన్నటి వరకు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపించిన మాట. ఇదిలా ఉంచితే గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్ తో తరచూ భేటీ అవుతోంది. దానికి కారణాలు ఏవైనప్పటికి బయట వినిపించే మాట.. పార్టీ అధ్యక్ష మార్పు విషయమే.

Also Read: జూన్‌ 26: రైతులకు రైతుబంధు

ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి ఈటెల రాజేంద్ర కు అప్పగిస్తారనే చర్చ గట్టిగానే నడిచింది. ఈటెల కూడా అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారట. కానీ ఎన్నికల టైమ్ లో అధ్యక్ష పదవి మార్చడం పార్టీకి నష్టంగా భావించిన అధిష్టానం.. ఆ ఆలోచనను విరమించుకుంది. ఇక అప్పటి నుంచి ఈటెల రాజేందర్ పార్టీ వ్యవహారాలపై అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని టాక్. ప్రస్తుతం ఆయన మౌనం.. పార్టీ మార్పుకు సంకేతమా ? అనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో పార్టీ మార్పుపై వార్తలు వచ్చిన ప్రతిసారి ఖండిస్తూ వచ్చిన ఈటెల ఈసారి ఎలా స్పందిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి చూడాలి ఈటెల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేది.

Also Read: షర్మిల కామెంట్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా ?

- Advertisement -