- Advertisement -
నేడు ఉదయం నిర్భయ దోషులను ఉరి తీసిని విషయం తెలిసిందే. కోర్టు ఆదేశించిన సమయం ప్రకారమే ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఉరి తీసేముందు నేరస్తులను చివరి కోరిక ఏంటో తెలుసుకొని తీరుస్తారు. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులను చివరి కోరిక చెప్పకుండానే నిర్భయ దోషులు ఉరికంబం ఎక్కారు. చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పాలని ఉరితీతకు ముందు దోషులను తీహార్ జైలు అధికారులు అడిగారు.
అయితే, వారి నుంచి మౌనమే సమాధానం అయింది. దోషులు ముఖేశ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లలో ఏ ఒక్కరు కూడా తమ చివరి కోరికను వెల్లడించలేదు. అనంతరం అనుకున్న సమయం ప్రకారం వారిని ఉరితీశారు.
- Advertisement -