The Paradise:ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్!

4
- Advertisement -

‘దసరా’ విజయానంతరం న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి రూపొందిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం మొదట మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉండగా, తాజాగా ఆగస్టు 21, 2026కు వాయిదా వేశారు. విడుదల తేదీ మార్పుతో కొంతమంది అభిమానులు నిరాశ చెందినప్పటికీ, దర్శక నిర్మాతలు ఏదో ప్రత్యేకమైనదాన్ని అందిస్తారనే ఆశతో ఉన్నారు.

ఇప్పుడు అభిమానులను ఉత్సాహపరిచేలా మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ను ఫిబ్రవరి 24, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!

చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. కయాడు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది.

- Advertisement -