కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ..!

12
- Advertisement -

పుట్టిన రోజు సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రగతి దార్శనికుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తమ ఆరాధ్య నేత, తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు, అభిమానులు కార్యకర్తలు, నేతలు, సామాన్యులు, యువకులు ,మహిళలు,ఎర్రవల్లి కేసీఆర్ నివాసానికి రాష్ట్ర వ్యాప్తంగా తండోప తండాలుగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ నివాస ప్రాంతం, జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మారుమోగింది.ఒకరి తర్వాత ఒకరుగా, వరుసలో వస్తూ, తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు కార్యకర్తలు కేసీఆర్ తో కలిసి ఫోటో దిగారు.

కాగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన తన అభిమానులను, ప్రజలను పలకరించి, ఓపికతో దాదాపు నాలుగు గంటలపాటు కేసీఆర్ వారితో ఫోటో దిగారు.

Also Read:The Paradise:ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్!

- Advertisement -