విడుదలకు ముందే వివాదాలను మూటగట్టుకున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’. కేరళ సీఎం పినరయి విజయన్ సైతం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా దీని విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి కూడా తెలిసిందే. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చిత్రికరించారని, దీని వల్ల సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ పిటిషన్‌లో ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. కానీ, ‘ది కేరళ స్టోరీ’ వివాదం కేరళ నుంచి తమిళనాడుకు పాకింది.
కేరళలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తమిళనాడులో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వకూడదని నిఘా సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం. మే 5న విడుదల కానున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సంస్థ ఈ హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తోంది. కేరళలో ఈ సినిమాలో చూపించిన విధంగా ఎలాంటి ఘటనలు జరగలేదని, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ‘ది కేరళ స్టోరీ’ తీశారని ఇంటెలిజెన్స్ సంస్థ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది.
Also Read:Uma Bharati:హ్యాపీ బర్త్ డే.. ఫైర్ బ్రాండ్
అయితే, మరోపక్క ఈ అభ్యంతరాలే ఈ సినిమాకి అదనపు పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ‘ది కేరళ స్టోరీ’ చిత్రం IMDB లీస్టులో అగ్రస్థానంలో నిలిచింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్షా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మే 1న IMDB అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో తొలి స్థానం సంపాదించింది అంటే.. అందుకు ముఖ్య కారణం ఈ సినిమా పై ఇంటెలిజెన్స్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేయడమే. మొత్తానికి హెచ్చరికే ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేలా ఉన్నాయి.
Also Read:ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..