జయలలిత..ది ఐరన్ లేడీ

340
jayalalitha biopic
- Advertisement -

తమిళ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మహానాయకురాలు అమ్మ జయలలిత.ఎంజీఆర్,కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న జయ…అమ్మగా ప్రజల్లో చెరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింతగా చేరువైన జయలలిత దశాబ్దాల పాటు తమిళరాజకీయాలను శాసించింది.

జయలలిత మరణం తర్వాత ఆమె బయోపిక్‌ తెరకెక్కించనున్నట్లు చాలామంది దర్శకులు ప్రకటించారు. అయితే చాలామంది కేవలం ప్రకటనలతోనే సరిపెట్టగా దర్శకురాలు ప్రియదర్శని మాత్రం ఏకంగా ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చింది.

జయ బయోపిక్‌కు ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌ లోగోను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విడుదల చేశారు. జయలలిత పాత్రలో హిరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నటిస్తోంది. ఇక ఈ సినిమాలో జయ నిచ్చెలి శశికళ,రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి పాత్రను ఎవరు పోషిస్తారు అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.

amma biopic

- Advertisement -