పశ్చిమాసియాలోనే అతిపెద్ద హోమ్ డెకార్ కంపెనీ ఐకియా స్టోర్స్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్, ఐకియా ప్రతినిధులతో కలిసి స్టోర్స్‌ను ప్రారంభించారు. తొలిరోజే ఐకియాలో హోమ్ ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా బెంగళూరు, ముంబయి, పుణెకు చెందిన వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చారు.
తొలిరోజు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రహదారులపై వాహనాలు బారులు తీరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అందుబాటు ధరలో ఎన్నో వస్తువులు ఒకే చోట లభించడం,ప్రజల నుంచి ఊహించని స్పందన రావటంతో నిర్వాహకులు నిస్సహాయంగా మిగిలారు.
ఈ స్టోర్ కోసం ఐకియా రూ. 800 కోట్ల రూపాయలు కేటాయించింది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్‌ను అభివృద్ధి చేశారు. స్టోర్‌లో పనిచేసే వారిలో 50 శాతం మంది మహిళలేనని కావడం విశేషం. స్టోర్‌లో 7,500 ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. అరబ్ దేశాలను దాటి తొలిసారిగా తెలంగాణలో రిటైల్ హోమ్ ఫర్నీషింగ్ స్టోర్‌ను నెలకొల్పడం విశేషం.
ఐకియా స్టోర్ ప్రత్యేకతలు..
() 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది
() 950 ప్రత్యక్ష ఉద్యోగులు మరో 1500 పరోక్ష ఉద్యోగులు ఈ స్టోర్‌లో పనిచేస్తున్నారు.
() 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభించనుండగా ఇందులో 20 శాతం ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేస్తోంది
() రూ. 200 లోపే 1000 ఉత్పత్తులు లభించనున్నాయి.
()టెక్స్టైల్ ఉత్పత్తులన్నీ అత్యుత్తమ కాటన్‌తో తయారు చేసినవి కావడం విశేషం
()ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ హైదరాబాద్‌దే. 1000 సీట్ల ఈ రెస్టారెంట్లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఫుడ్.
అంతేగాదు ఈ రెస్టారెంట్ మెనూలో సగం శాకాహార వంటకాలే . ఇడ్లీ సాంబార్, సమోస, వెజ్ బిర్యానీ వంటివి లభిస్తాయి
()తెలంగాణలో తయారయ్యే చేనేత ఉత్పత్తులు కూడా లభించనున్నాయి