ప్రభాస్‌కు సవాల్‌ విసిరిన తలసాని…

211
talasani

కంటికి ఇంపుగా పచ్చదనం, పరిసరాలకు నిండుతనం. ఇదే నినాదం ఇప్పుడు నాలుగో విడత తెలంగాణకు హరితహారంలో పలువురికి స్ఫూర్తిని నింపుతోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా భూతాపాన్ని నివారించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణ పరిస్థితులు అందించాలనే సంకల్పంలో భాగం అయ్యేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విసిరిన హరిత ఛాలెంజ్‌ను తలసాని స్వీకరించి పూర్తిచేశారు. ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటిన తలసాని… ఎన్టీఆర్‌, ప్రభాస్‌, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు హరిత సవాల్‌ విసిరారు.

nagarjuna green challeange

భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉండాలంటే అందరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ భాద్యత కూడా తీసుకోవాలని కోరారు మంత్రి తలసాని. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కోట్ల మొక్కలను నాటామని వెల్లడించారు.

మంత్రి కేటీఆర్, ఎంపీక క‌విత‌, క్రికెట‌ర్లు స‌చిన్, వివిఎస్ ల‌క్ష్మ‌ణ్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి,మహేష్ బాబు,చిరంజీవి,నాగార్జున,పవన్ కల్యాణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి గ్రీన్ ఛాలెంజ్‌ స్పందించారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి హీరో ప్రభాస్,ఎన్టీఆర్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.