గ్లామర్ డోస్ పెంచేసిన..రకుల్

250
The Hottest Avatar Of Rakul
- Advertisement -

స్పైడర్,ఖాకి సినిమాలతో కాస్త డీలా పడిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ రూట్ మార్చేసింది. మొన్నటివరకు కేవలం గ్లామర్ పాత్రలతోనే సరిపెట్టుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ ఒక్కసారిగా బాలీవుడ్‌లో అవకాశం రావడంతో మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. బాలీవుడ్‌లో తొలితొలి అడుగులు వేస్తున్నప్పుడు మ్యాగజైన్ల కోసం రచ్చ చేయడం మెదలెడతారో..ఇప్పుడు రకుల్ కూడా అదే బాటలో వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది.

తాజాగా మగాళ్ల మ్యాగజైన్ మ్యాగ్జిమ్ కోసం ఇలా పోజు ఇచ్చింది రకుల్. ఆ పత్రిక తాజా కవర్ పేజీపై ఆమె ఇలా దర్శనమిచ్చింది. తెల్లటి బికినీ వేసుకుని.. తన మేని సొగసులను బాగా సానబెట్టి మరీ అందాలను ఆరబోస్తోంది. వయ్యారమైన తన కాళ్లతో ఎన్నో భావాలను పలికిస్తూ.. ఊపిరిని ఆడనివ్వకుండా చేస్తున్న ఆ క్లీవేజ్ తాలూకు సౌందర్యంతో అమ్మడు ప్రకంపనాలు సృష్టించింది.

ప్రస్తుతం హిందీలో అయ్యారి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్.. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. మొదటగా నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో నాని సరసన కథానాయిక పాత్ర కోసం రకుల్‌ని చిత్రబృందం అప్రోచ్‌ అయ్యిందట. అందుకు ఆమె కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో పాటు నితిన్‌, శర్వానంద్‌ హీరోలుగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు ‘దాగుడుమూతలు’ పేరుతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవిని ఎంపిక చేశారు. మొత్తానికి బాలీవుడ్ బాటపట్టిన తర్వాత రకుల్ తన గ్లామర్‌కు మరింతగా పదును పెంచేసింది.

- Advertisement -