ఆదిపురుష్‌ పై ముదురుతున్న వివాదం…ఆ సీన్లు తొలగించండి

178
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రంపై రోజురోజుకీ వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. దీంతో ఈ చిత్రంలోని కొన్ని పాత్రలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు. అందులో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి.

టీజర్‌లో హిందూ దేవతల వస్త్రాధారణ భిన్నంగా పుంది. హనుమంతుడు లెదర్‌ వేసుకున్నట్లుగా చూపించారు. మిగిలిన దేవతల వస్త్రధారణ కూడా గ్రంథాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా ఉంది. మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సీన్లను తొలగించాలని ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నా అని నరోత్తమ్‌ మిశ్రా పేర్కొన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నరోత్తమ్ మిశ్రా ఇలా వార్నింగ్‌ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.. ఈ ఏడాది జులైలో విడుదలైన లీనా మణిమేఖలై రూపొందించిన కాళీ పోస్టర్‌పైనా ఆయన ఇదే తరహాలో స్పందించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సంక్రాంతి కానుకగా రాబోతుంది. రామాయాణ ఇతివృత్తం ఆధారంగా వస్తున్న ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ అలీఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్‌ సీత పాత్రలో కనిపిస్తున్నారు.

ఇటీవలే అయోధ్యలో అత్యంత అట్టహాసంగా ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేశారు. రిలీజ్ చేసిన గంటల్లోనే ఈ మూవీ టీజర్ కు విశేష స్పందన వచ్చింది. కేవలం 19 గంటల వ్యవధివోనే 63మిలియన్ల వ్యూస్, 10 లక్షల లైక్స్ వచ్చాయి.

- Advertisement -