ది గోట్ లైఫ్..అద్భుతమైన సినిమా

23
- Advertisement -

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. తాజాగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా సెలబ్రిటీ ప్రీమియర్ షోను పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ చూశారు. అద్భుతమైన సినిమా చూశామంటూ వారు ప్రశంసించారు.

ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షో లో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, నిర్మాత వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, దర్శకులు హను రాఘవపూడి, అజయ్ భూపతి, శివ నిర్వాణ, పి.మహేశ్ బాబు, ప్రవీణ్ సత్తారు, శ్రీను వైట్ల, కిషోర్ తిరుమల, చంద్రసిద్ధార్థ్ పాల్గొన్నారు. జీవితంలో ఒకసారే ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం వస్తుందని, ఈ సినిమాకు అన్ని అవార్డ్స్ దక్కుతాయని సెలబ్రిటీలు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా మీద ప్రశంసలు కురిపించారు. ది బెస్ట్ సర్వైవల్ మూవీ అని, ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని డైరెక్టర్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ కు హ్యాట్సాప్ చెబుతూ కొన్ని ఏళ్లపాటు ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ అవడం సాధారణ విషయం కాదని అభినందించారు.

“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వనుంది.

Also Read:OTT:ఈవారం చిత్రాలివే

- Advertisement -