తెలంగాణ మెగాస్టార్ విజయ్ దేవరకొండ

269
Vijay Devarakonda: RGV
- Advertisement -

విజయ్‌ దేవరకొండ రొమాంటిక్‌ డ్రామా ‘అర్జున్ రెడ్డి’ విజయయాత్ర కొనసాగుతోంది. ఇటు ప్రేక్షకులు, అటు ప్రముఖులు, విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంటున్న ఈ సినిమాపై తాజాగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్‌హీరో విజయ్‌ను వర్మ ప్రశంసలతో ముంచెత్తారు.

First Megastar of Telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి తెలంగాణకు మొదటి మెగాస్టార్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత ఈ అభిప్రాయానికొచ్చానన్నాడు వర్మ.“ఈ తరం హీరోలంతా హీరోయిజం చూపించడానికి స్లో మోషన్, ర్యాంపింగ్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఆధారపడుతున్నారు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ పై డిపెండ్ అవ్వకుండా హీరోయిజం చూపించిన మొట్టమొదటి హీరో విజయ్ దేవరకొండ అని వర్మ చెప్పాడు.

First Megastar of Telangana

ఈ విషయంలో అమితాబ్ బచ్చన్ తర్వాత దేవరకొండే కనిపిస్తున్నాడని, యంగ్ అమితాబ్, యంగ్ ఆల్-పాచినోను కలిపితే విజయ్ దేవరకొండ  అని అభివర్ణించారు వర్మ. కొత్త తరం హీరోగా అతను ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తాడని నేను బలంగా భావిస్తున్నా. టాలీవుడ్‌ అమితాబ్‌ బచ్చన్‌గా, తెలంగాణ తొలి మెగాస్టార్‌గా అతను నిలుస్తాడని నేను కచ్చితంగా చెప్పగలను’ అని వర్మ పేర్కొన్నారు.

- Advertisement -