Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, March 10, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఆధార్‌ లింక్ చేయడానికి.. అదే గడువు తేది..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

ఆధార్‌ లింక్ చేయడానికి.. అదే గడువు తేది..

October 16, 2017 11:34 AM
293
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ఆధార్‌ కార్డు ఇప్పుడు అందరికీ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ వంట గ్యాస్‌, వృద్దాప్య పెన్షన్‌తో సహా రకరకాల సబ్సిడీ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందడానికి, స్థిరాస్తులు, వాహనాల రిజిస్ర్టేషన్‌కు, కొత్త మొబైల్‌ నెంబర్‌ కనెక్షన్‌, రేషన్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, బ్యాంకు ఖాతా తదితరాలకు ఆధార్‌ కీలకంగా మారింది. పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్నా ఆధార్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలో మొబైల్‌ నెంబర్‌ను గుర్తుంచుకుంటున్నట్టుగానే 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే రోజులు వచ్చేశాయి. ఇప్పటి వరకు దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు ఆధార్‌ నెంబర్‌ను జారీ చేశారు. ఆధార్‌ను కీలకమైన పలు సర్వీసులతో, విభాగాలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం గడువును కూడా ప్రకటించింది.

    The deadline for Aadhaar Linking

    మొబైల్‌ ఫోన్‌కు అనుసంధానం చేయడానికి ఆఖరు తేదీ..

    ఈ రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. రెండు మూడు టెలికాం సంస్థల సిమ్‌ కార్డులను కూడా వాడుతున్న వారు ఉన్నారు. ఒకరి పేరు మీద ఉన్న నెంబర్‌ను మరొకరు వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీటి దుర్వినియోగం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ నెంబర్లతో కస్టమర్లు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ సాగుతోంది. దీనికి తుది గడువు వచ్చే ఫిబ్రవరి 2018. టెలికాం సంస్థలు నిర్వహించే స్టోర్లు, రిటైల్‌ ఔట్‌లెట్లలో మొబైల్‌ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్‌ వినియోగదారు సంబంధిత టెలికాం సంస్థకు చెందిన స్టోర్‌కు వెళ్లి తమ మొబైల్‌ నెంబర్‌ను తెలియజేయగానే ఆ నెంబర్‌కు ఒటిపి వస్తుంది. ఒటిపితోపాటు ఆధార్‌ నెంబర్‌, బయోమెట్రిక్‌ మిషన్‌పై వేలిముద్రను వేయడం ద్వారా తమ పాత మొబైల్‌ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ ముగుస్తుంది. ఆధార్‌ ఆధారిత ఇ-కెవైసితో ఇప్పుడు టెలికాం కంపెనీలు కొత్త సిమ్‌కార్డులను జారీ చేస్తున్నాయి.

    The deadline for Aadhaar Linking

    బ్యాంకులో ఖాతాతో అనుసంధానం చేయడానికి ఆఖరు తేదీ..

    బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ నెంబర్‌ను ఆ ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు తుది గడువు వచ్చే డిసెంబర్‌ 31వ తేదీ. విభిన్న మార్గాల ద్వారా బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను అనుసంధానం చేసే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. నెట్‌ బ్యాంకింగ్‌, ఎటిఎం, ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారానే కాకుండా నేరుగా బ్యాంకుకు వెళ్లి ఖాతాదారు తన ఆధార్‌ను ఖాతాతో అనుసంధానం చేయవచ్చు. బ్యాంకులతోపాటు ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లు, ఇంటర్మీడియేటరీలకు కూడా కొంత మంది కస్టమర్లు తమ ఆధార్‌ వివరాలను డిసెంబర్‌ 31 వరకు తెలియజేయాలి. లేని పక్షంలో ఈ ఖాతాలను స్తంభింపజేస్తారు.

    The deadline for Aadhaar Linking

    పాన్‌ నెంబర్‌తో అనుసంధానం చేయడానికి ఆఖరు తేదీ..

    ఆదాయం పన్ను రిటర్నులను సమర్పించే వారు తమ పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు దీని గడువు ఆగస్టు 31 వరకే ఉండేది. అయితే ఈ గడువును ఈ ఏడాది సెంబర్‌ 31 వరకు పెంచారు. చాలా మంది ఒకటికి మించి పాన్‌ కార్డులను వినియోగిస్తూ పన్నులను ఎగవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు తప్పనిసరిగా తమ పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చారు. పాన్‌తో ఆధార్‌ అనుసంధానాన్ని చాలా సులభతరం చేశారు.

    The deadline for Aadhaar Linking

    incometaxindiaefiling.gov.in లింక్‌ ద్వారా ఆదాయం పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ పేజీలోకి ప్రవేశించవచ్చు. ఇందులో ఎడమ భాగంలో ‘లింక్‌ ఆధార్‌’ అన్న మరో లింక్‌ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో పాన్‌, ఆధార్‌ నెంబర్‌, ఆధార్‌పై ఉన్న పేరును ఎంటర్‌ చేయాలి. తర్వాత లింక్‌ ఆధార్‌ అన్న బటన్‌ను క్లిక్‌ చేయగానే పాన్‌తో ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.. ఇక సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందే వారందరూ డిసెంబర్‌ 31లోగా తమ ఆధార్‌ నెంబర్‌ను ఆయా ప్రభుత్వ శాఖలకు అందజేయాల్సి ఉంటుంది. పిపిఎఫ్‌, జాతీయ పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసినవారు కూడా డిసెంబర్‌ 31లోగా ఆధార్‌ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. పెన్షన్లు, స్కాలర్‌షిప్పులు, ఎల్‌పిజి సబ్సిడీలకు ఆధార్‌ తప్పకుండా లింక్‌ చేసుకోవాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు.

    - Advertisement -
    • TAGS
    • 31 December
    • Aadhaar
    • Aadhaar Linking
    • Aadhaar linking social sector
    • aadhar link to bank account
    • aadhar link to driving license
    • aadhar link to sim card
    • BANKS
    • PAN card
    • PAN link
    • social sector schemes
    • Tax payers
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleసినిమా కోసం.. ప్లేట్లు కడిగానంటున్న సూర్య..
      Next articleబాలకృష్ణకు పోటిగా పవన్…
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv