60 దాటాక కూడా ఆరోగ్యంగా జవించాలంటే.. !

16
- Advertisement -

ఆరు పదుల వయస్సు దాటాక కూడా ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా, మానసికంగా ఉండటం. దీనికి కొన్ని అలవాట్లను అలవర్చుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి ప్రసిద్ధ మానసిక వైద్యులు హిడెకి వాడా రాసిన “ది 80 ఓల్డ్ వాల్” అనే పుస్తకం జపాన్‌లోనే అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకంగా నిలిచింది. ఇప్పటికే 5 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది.

ఇంతకి ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన సూచనలను ఓసారి పరిశీలిస్తే…

()కోపం వచ్చినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చండి.

()శరీరం అలసిపోయేంతవరకు వ్యాయామం చేయండి.

()వేసవిలో ఏసీ వాడితే, ఎక్కువ నీళ్లు తాగండి

Also Read:సుప్రీంకోర్టు ఆదేశాలు.. బీఆర్ఎస్ పార్టీ విజయం

()“డైపర్లు” వాడటం చలాకీగా కదలడంలో సహాయపడుతుంది.

()తరచుగా నడవటం శరీరానికి, మెదడుకు ఉత్తేజాన్ని ఇస్తుంది.

()మరచిపోవడం వయస్సు వల్ల కాదు, మెదడును వినియోగించకపోవడం వల్ల.

()అనవసర మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు.

()బీపీ, షుగర్‌ను బలవంతంగా తగ్గించాల్సిన పని లేదు.

()ఒంటరిగా ఉండటం ఒంటరితనమేం కాదు – అది సంతోషంగా గడిపే సమయం.

()అలసటను దూరంగా ఉంచండి

()వృద్ధులకు డ్రైవింగ్ ప్రమాదకరం కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పునఃపరిశీలించండి.

()మీకు నచ్చిన పని చేయండి – నచ్చని పనులు చేయాల్సిన అవసరం లేదు.

()సహజ కోరికలు వృద్ధాప్యంలో కూడా ఉంటాయి – ఇది సహజం.

()ఇంట్లోనే ఉండిపోకండి.

()మీకు నచ్చినది తినండి – కొంచెం బరువు పెరిగినా సరే.

()ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.

()నచ్చని వాళ్లను దూరంగా ఉంచండి.

()టీవీ ముందు గంటల తరబడి కూర్చోకండి.

()వ్యాధులతో పోరాడకండి – వాటితో జీవించటం నేర్చుకోండి.

()తాజా పండ్లు, సలాడ్లు తినండి.

()స్నానం 10 నిమిషాల్లో పూర్తిచేయండి.

()నిద్ర రాకపోతే బలవంతంగా నిద్ర పోయేందుకు ప్రయత్నించకండి.

()సంతోషంగా ఉన్నప్పుడే మెదడు చురుకుగా ఉంటుంది.

()ఏం చెప్ప దలుకుచుకున్నారో స్పష్టంగా చెప్పండి – ఎలా మాట్లాడాలి అని అతి ఆలోచించకండి.

()ఓ “ఫ్యామిలీ డాక్టర్”ను ముందే ఎంపిక చేసుకోండి.

()చాలా భాద్యతగల వ్యక్తిగా కాకుండా – కొంచెం సరదాగా, పాపం లేకుండా ఉండటం ఓ హక్కు.

()అప్పుడప్పుడు మీ భావనను మార్చుకోవటం, అణకువగా ఉండటం మంచిదే.

()చివరి దశలో వచ్చే “డెమెన్షియా”ను దేవుని వరంగా చూడండి.

()మీరు నేర్చుకోవటం మానేసినప్పుడు నిజంగా వృద్ధులవుతారు.

()ఖ్యాతి కోసం తాపత్రయపడకండి – మీ వద్ద ఉన్నదే చాలునని భావించండి.

()నిర్లిప్తత వృద్ధులకు దక్కే ప్రత్యేక హక్కు.

()సమస్యలే జీవితాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి!

()సూర్యరశ్మిలో కూర్చోవటం ఆనందాన్ని ఇస్తుంది.

()ఇతరులకు మంచి చేయండి.

()రోజు ప్రశాంతంగా జీవించండి.

()కోరికలు – దీర్ఘాయుష్కు మూలం.

()ఎప్పుడూ సానుకూలంగా ఉండండి.

()స్వేచ్ఛగా ఊపిరి పీల్చండి.

()జీవిత నియమాలు మీ చేతుల్లోనే ఉన్నాయి.

()ప్రతిదాన్ని శాంతిగా అంగీకరించండి.

()సంతోషంగా ఉన్నవాళ్లను అందరూ ప్రేమిస్తారు.

()నవ్వు అదృష్టాన్ని తెస్తుంది.

ఈ చక్కని సూచనలు పాటించండి.. ఇతర స్నేహితులతో పంచుకోండి!

- Advertisement -