మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్‌కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా నుంచి హే మేఘలే సాంగ్ ని లాంచ్ చేసిన మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు.
ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ‘విక్రాంత్ IPS’గా నటిస్తున్నారు. వ్యవస్థను సవాల్ చేయడాన్ని భయపడని డేరింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘హే మేఘలే’ పాటకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, శ్రీ హర్ష ఎమ్మానీ లిరిక్స్ రాశారు. ఈ పాట ద్వారా హీరో సమాజంలోని చీకటి శక్తులకు వ్యతిరేకంగా చేసే పోరాటం, అంకితభావంను అద్భుతంగా చూపించారు. రేవంత్, సాహితి చాగంటి ఆలపించిన ఈ పాత, ప్రేక్షకుల మనసుని తాకుతుంది. ఇది విక్రాంత్ ని ఓ గ్లింప్స్ లా ప్రజెంట్ చేస్తూ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రంలో ఆర్‌కే సాగర్‌కు జోడీగా మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నికల్ పని చేస్తోంది శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీని, హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్‌ను, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్‌ను, చిన్నా ప్రొడక్షన్ డిజైన్‌ను, సుధీర్ వర్మ పెరిచర్ల డైలాగ్స్‌ను అందించారు.
Also Read:హిందువులు..హిందువుగా ఉండొద్దా?:పవన్

