‘దటీజ్ మహాలక్ష్మీ’గా మిల్కీ బ్యూటీ..

290
Tamanna
- Advertisement -

హిందీలో కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం క్వీన్. ఈ సినిమా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాను దక్షిణాదిలో అన్ని సినీ పరిశ్రమలో రీమేక్ చేస్తుండగా తెలుగులోనూ రీమేక్ చేస్తున్నారు  చిత్ర నిర్మాతలు.

Tamanna

 మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది. మొదటగా ఈ సినిమాకు మిస్సమ్మ ఫేం నీలకంఠ దర్శకత్వం వహిస్తారు అనుకున్నారు. కానీ ఈ సినిమా చివరికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మచేతిలోకి వచ్చిపడింది. ఇక ఈ మూవీకి సంబంధించిన టైటిల్ విషయంలో గతంలో అనేక వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాకు ‘దటీజ్ మహాలక్ష్మీ’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. గతంలో తమన్నా నటించిన 100పర్సెంట్ లవ్ చిత్రంలో ఆమెను ఉద్దేశించి పాడిన పాటను ఈ సినిమా టైటిల్‌గా వాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో శరవేగంగా జరుపుకుంటోంది.

- Advertisement -