దట్ ఈజ్ కే‌టి‌ఆర్..!

46
- Advertisement -

దేశం ప్రస్తుతం తెలంగాణ అన్నీ రంగాల్లోనూ అగ్రపథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ రంగంలో మరే ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడలేని విధంగా తెలంగాణ ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఈ స్థాయిలో అభివృద్ది చెందడానికి కారణం సి‌ఎం కే‌సి‌ఆర్ పరిపాలన విధానం, కారణమయితే. ఐటీ శాఖ మంత్రిగా కే‌టి‌ఆర్ విజన్ మరో కారణం అని చెప్పక తప్పదు. భారీ పరిశ్రమలను పెట్టుబడులను ఆకర్షించడంలో కే‌టి‌ఆర్ వైఖరి ఇతర రాష్ట్రాల మంత్రులను కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇప్పటికే దేశ విదేశాల్లోని ఎన్నో కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చిన మంత్రి కే‌టి‌ఆర్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: రెజ్లర్ల ఆరోపణలన్ని.. వట్టివే ?

యూకే, అమెరికా వంటి దేశాల్లో రెండు వారాల పాటు పర్యటించిన కే‌టి‌ఆర్ దాదాపు 30 మంది సిఈఓ లతో 80 సమావేశాలలో పాల్గొనినట్లు తెలుస్తోంది. ఇక ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఎన్నో బడా కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వేల కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్రానికి అదనంగా 42 వేల ఉద్యోగాల రూపకల్పనకు నాంది పలికారు మంత్రి కే‌సి‌ఆర్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కే‌సి‌ఆర్‌ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. దీంతో 42000jobs అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు విపక్ష పార్టీల నుంచి ఇతర రాష్ట్రాల నేతల నుంచి కూడా కే‌టి‌ఆర్ పర్యటనపై ప్రశంసలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే తన విజన్ తో ఐటీ రంగాన్ని పూర్తిగా ఇన్నోవేషన్ బాటా పట్టించిన కే‌టి‌ఆర్.. రాబోయే రోజుల్లో తన ఐడియాలజీ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే ఐటీ నెంబర్ ఒన్ గా నిలిపే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Also Read: బోనాలు..దేవాలయాలకు ఆర్ధిక సహాయం: తలసాని

- Advertisement -