ఆ హీరోయిన్‌ నాకు చెల్లి..!

239
That heroine like sister for Sreesanth
That heroine like sister for Sreesanth
- Advertisement -

ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో కళంకితుడైన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆ దెబ్బతో క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. క్రికెట్ వదిలేసిన తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేసిన శ్రీశాంత్ త్వరలో ‘టీమ్ 5’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెడ్‌ కార్పెట్‌ ఫిలింస్‌ పతాకంపై రాజ్‌ జక్కారియాజ్‌ నిర్మిస్తున్నారు. మూడు బాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీశాంత్ సరసన నటి నిక్కీ గల్రాని నాయికగా నటిస్తోంది.

sree team 5

ఈ సందర్భంగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ, తనకు ఇది తొలి చిత్రమని, నిక్కీ గల్రాని ఇప్పటికే 25 చిత్రాలకు పైగా నటించారని, ఆమె తనకు చెల్లెలితో సమానమని అన్నాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ ను చూసి తాను పెరిగిన వాడినని శ్రీశాంత్ చెప్పాడు. విజయ్, అజిత్ లతో కలిసి నటించే అవకాశం వస్తే కనుక, అది చిన్న సన్నివేశమైనా సరే నటించేందుకు తాను సిద్ధమని ఈ సందర్భంగా శ్రీశాంత్ చెప్పాడు. తనకు సినిమా, క్రికెట్ రెండూ ఇష్టమేనని చెప్పిన ఆయన, త్వరలోనే భారత క్రికెట్ జట్టుతో కలిసి ఆడనున్నట్టు చెప్పాడు. చిత్రం గురించి కథానాయకుడిగా పరిచయం అవుతున్న శ్రీశాంత్‌ తెలుపుతూ ఈ చిత్రంలో తాను బైక్‌ రేసర్‌గా నటిస్తున్నానని తెలిపారు.అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందానని చెప్పారు.

- Advertisement -