గత కొంత కాలంగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన డేటింగ్ వ్యవహారాలను, తన ఘాటు ప్రేమ సంగతులను బయట పెడుతూ వస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో ఓ భారీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ.. ‘‘ఆ సినిమా పేరు నేను బయటకు చెప్పను. కానీ, ఆ సినిమా అనుభవం మాత్రం పరమ చెత్త. సెట్స్‌లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. అందుకే ఆ సినిమా నాకు నచ్చదు’’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ఇంతకీ ప్రియాంక చోప్రా ఏ సినిమా గురించి ఈ కామెంట్స్ చేసింది అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా ఈ కామెంట్స్ చేసింది సల్మాన్ ఖాన్ సినిమా గురించే అని టాక్ నడుస్తోంది. అయినా, ప్రియాంక చోప్రాకి షాకింగ్ కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. రీసెంట్ గా కూడా హీరోయిన్ల జర్నీ పై బోల్డ్ గా మాట్లాడింది. బాలీవుడ్ లో డేటింగ్ వ్యవహారాలు సర్వసాధారణం అని, ముఖ్యంగా హీరోయిన్లు తమ కెరీర్ లో డేటింగ్స్ చేయకుండా తమ సినీ ప్రయాణాన్ని ముందుకు సాగించలేరు అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అందుకే, తాను ఎంతోమంది సహ నటులతో సంబంధాలు కొనసాగించాను అని చెప్పి ప్రియాంక చోప్రా షాక్ ఇచ్చింది.
Also Read: వీడియో దుమ్మురేపుతోంది.. కానీ
ప్రియాంక చోప్రా గురించి కూడా బాలీవుడ్ లో చాలా బోల్డ్ గా చెబుతూ ఉంటారు. ప్రియాంక చోప్రా ఒక స్టార్ నుంచి మరో స్టార్ కి, అలాగే మరో స్టార్ నుంచి ఇంకో స్టార్ కి చాలా సులభంగా మారగలదు అని, ప్రియాంక చోప్రా చాలా స్వేచ్ఛగా ఉండేది అని, పైగా సెట్ లో పని చేసే వారితోనూ ఆమె చాలా సరదాగా గడిపేది అని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా అంటేనే బోల్డ్.
Also Read: వరుణ్ – లావణ్య ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్!