CMD ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు- ఫించన్ దారుల అసోసియేషన్

146
CMD Prabhakar Rao
- Advertisement -

విద్యుత్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఫించన్ దారుల లైఫ్ సర్టిఫికెట్ ఆన్ లైన్ లో ఇవ్వడం పట్ల విద్యుత్ ఫించన్ దారుల అసోసియేషన్ ఒక ప్రకటనలో ట్రాన్స్కో,జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆ సంఘం చైర్మన్ వి.యస్ సుందర్ రావు,ఫించన్ దారుల అసోసియేషన్ జేఏసి కన్వీనర్ కలువల సత్యనారాయణ రావులు మాట్లాడుతూ.. కరోనా సమయంలో సీనియర్ సిటీజన్లు ఇంటి నుండి బయటకు రావొద్దు అన్న నిబంధనలు ఉన్నందున ఈ యాప్ ఫించన్ దారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

అటువంటి యాప్ ను రూపొందించి సీనియర్ సిటీజన్లు పదవీ విరమణ పొందిన ఫించన్ దారుల పట్ల ఉదారతను చాటుకున్న సియండి ప్రభాకర్ రావుకి ఎంతగానో రుణపడి ఉంటామన్నారు.ఏకకాలం ట్రాన్స్కో,జెన్కో లతో పాటు టియస్ యస్పిడిసిఎల్,యన్.పి.డి.సి.యల్ పరిధిలో ఈ యాప్ ను ప్రవేశ పెట్టడం ఈ టైంలో అహ్హనించ దగ్గదని వారు పేర్కొన్నారు.అందుకు సహకరించిన జేయండి శ్రీనివాసరావుతో పాటు టియస్ యస్పిడిసిఎల్ సియండి రఘుమారెడ్డి,యన్. పిడిసియల్ సియండి గోపాల్ రావుకి వారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -