విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

43
- Advertisement -

బీఆర్ఎస్‌ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జూలై 3వ తేదీన తాండూరులో రాజశ్యామల యాగం నిర్విఘ్నంగా సాగేలా దీవించాలని స్వరూపానందేంద్ర స్వామిని కోరారు. ఈయనతో పాటుగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ కూడా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ నెల 21వ తేదీన చాతుర్మాస్య దీక్ష కోసం స్వరూపానందేంద్ర స్వామి రిషికేష్ బయలుదేరుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆయన నుంచి ఆశీస్సులు అందుకున్నారు.

Also Read: షర్మిల కామెంట్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా ?

- Advertisement -