దుమ్ములేపుతున్న వినయ విధేయ రాముడు

241
vinaya videya rama
- Advertisement -

రంగస్థలం అందించిన జోష్‌ మరింత స్పీడు పెంచాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేస్తున్నారు. మాస్‌,యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన బోయపాటి-చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల విడుదల చేసిన టీజర్‌,ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తన మార్క్‌ మాస్,యాక్షన్‌ను ఏమాత్రం మిస్ కాకుండా బోయపాటి సినిమా ఎలాఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. టీజర్‌ ద్వారా యాక్షన్‌ సీన్‌ని చూపించిన బోయపాటి తాజాగా ఫ్యామిలీ సాంగ్‌తో అలరించాడు.

రాంచరణ్ 12వ సినిమాగా వస్తుండగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించి టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు పెంచింది. తందాన తందాన అంటూ సాగే సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఉత్స‌వాల‌కి సంబంధించిన నేప‌థ్యంలో సాగే ఫ్యామిలీ సాంగ్‌గా అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -