అధైర్య పడొద్దు : తమన్నా

363
- Advertisement -

నందమూరి హరికృష్ణ అకాల మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

  thanamma Tweets About HariKrishna Death

తాజాగా హీరోయిన్ తమన్నా తన సంతాపాన్ని తెలియజేసింది. ‘నందమూరి హరికృష్ణ గారి మరణ వార్త వినగానే గుండె పగిలిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ బాధాక‌ర ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌కు వచ్చి మీరంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది తమన్నా.

- Advertisement -