తమన్నా..ఆ హీరోని మిస్సవుతోందట…

525
- Advertisement -

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తెలుగు సినిమా ‘బాహుబలి’లో అవంతికగా మెరిసిన తమన్నా…ఆ సినిమా తర్వాత డీలా పడిపోయింది. ఇప్పుడు తమన్నా దూకుడికి టాలీవుడ్‌ లో బ్రేక్‌ పడింది. కారణం గ్లామర్‌ ప్రపంచంలోకి కొత్త హీరోయిన్స్‌ రావడమేనని చెప్పాలి.

ఇక టాలీవుడ్‌ లో ఈ మిల్కీబ్యూటీకి ఆఫర్లు లేకపోవడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

thamanna talk about hero vikram

అక్కడ స్టార్ హీరో విక్రమ్ తో ‘స్కెచ్’ మూవీ చేస్తోంది తమ్మూ. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకోగా.. తమన్నాకు సంబంధించిన ఎపిసోడ్స్ పూర్తయినట్టు తెలుస్తోంది.

thamanna talk about hero vikram

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందమైన, అద్భుతమైన జర్నీలా ఈ సినిమా షూటింగ్ కొనసాగిందని, ఈ సినిమా యూనిట్ తో కలిసి పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుందని, అంతేకాకుండా తన పోర్షన్ పూర్తయిపోవడం వలన హీరో విక్రమ్ సార్‌ ను మిస్సవుతున్నానని కూడా చెప్పుకొచ్చింది తమన్నా.

- Advertisement -