- Advertisement -
తమిళ హీరో తళపతి విజయ్ క్రితం ఏడాది దీపావళికి ‘సర్కార్’తో వచ్చిన అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ దీపావళికి కూడా మరో చిత్రంతో రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘తెరి’ .. ‘మెర్సల్’ వంటి భారీ విజయాలను అందించిన అట్లీ కుమార్ దర్శకత్వంలో మూడో సినిమాగా విజయ్ ‘బిగిల్’ చేస్తున్నాడు. దీన్ని మహేష్ కోనేరు తెలుగులో విజిల్ పేరుతో అందిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. వారం తిరక్కముందే ఈ ట్రైలర్ 29 మిలియన్ల వ్యూస్ ను .. 2 మిలియన్ల లైక్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును సృష్టించింది. ఫుట్ బాల్ కోచ్ గా ఊర మాస్ లీడర్ గా రెండు షేడ్స్ చేస్తున్న విజయ్ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.
- Advertisement -