సీఎం కేసీఆర్‌తో త‌మిళ సూపర్‌ స్టార్‌ విజ‌య్ భేటీ..

194
hero vijay
- Advertisement -

తమిళ సినీ హీరో విజయ్ బుధ‌వారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా హీరో విజయ్‌ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయ్‌ని సీఎం కేసీఆర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. కోలీవుడ్ హీరోకు ఓ వీణను బహూకరించారు కేసీఆర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తాను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. హీరో విజయ్ తోపాటు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు.

- Advertisement -