అమ్మ వారసుడిగా అజిత్…!

354
- Advertisement -

రెండు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటుంది తమిళనాడు సీఎం జయలలిత. లండన్ నుంచి వైద్య బృందం, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా డాక్టర్లు దగ్గరుండి జయకు చికిత్స చేస్తున్నారు. మరింత మైరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తరలించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ సైతం జయలలితను పరమర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ajith shalni

ఈ నేపథ్యంలో అమ్మ తర్వాత ప్రభుత్వానికి, పార్టీకి మార్గనిర్దేశం చేసిది ఎవరు అనే విషయంలో తమిళనాడులో చర్చ జరుగుతుంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయాక 1989లో ఆ పార్టీ పగ్గాలు జయలలిత చేపట్టారు. అప్పటి నుంచి ఈనాటి వరకు పార్టీలో జయలలిత ఎదురులేని నాయకురాలిగా ఏక ఛత్రాధిపత్యంతో పార్టీని నడిపారు. తన ముందు సాగిలపడే కార్యకర్తలకు పురుచ్చితలైవి అమ్మగా, తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటూ పాలన సాగించారు. ఈ క్రమంలో ఆమె ప్రత్యామ్నాయంగా పార్టీలో రెండో స్థానంలో ఎవరిని ఎదగనీయలేదు.

ajith

ఈ క్రమంలోనే జయలలిత వారసుడిగా హీరో అజిత్ అంటూ వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకేలోనూ ఇదే విషయంపై హాట్ టాపిక్ అయ్యింది. కామన్ మ్యాన్ గా, అమ్మకు అత్యంత సన్నిహితుడిగా అజిత్ కు పేరుంది. మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. పార్టీకి అజిత్ కరెక్ట్ పర్సన్ అని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయంట. ప్రజల్లోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ వార్తలను అజిత్ ఇప్పటి వరకు ఖండించలేదు. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు.అయితే అజిత్‌కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఇంత సడన్‌గా ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగిస్తే ఏ మేరకు రాణిస్తారోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ajith-shalini

- Advertisement -