12 మంది చిన్నారులు సేఫ్.. రెస్క్యూ టీం రిస్క్ వీడియో..

238
Tham-Luang-cave-rescue
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 12 మంది చిన్నారుల ఘటనకు తెరపడింది. కోచ్ తో సహా 12 మంది చిన్నారులను రెస్క్యూ టీం సురక్షితంగా బయటికి తీసుకువచ్చింది. 19 మంది రెస్క్యూ అధికారులతో ఆదివారం సహాయక చర్యలు ప్రారంభించగా నేటితో ముగిసింది. ఆదివారం నలుగురిని, సోమవారం నలుగురుని, నేడు కోచ్ తో సహా మిగతా పిల్లలను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. బయటికి తీసుకువచ్చిన పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న పిల్లలను థాయ్ లాండ్ ప్రధాన మంత్రి ప్రయుత్‌ చాన్‌-ఓచా కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు సమాచారం.

thailand-newsthai-football-teamthai-cave-rescuefootball-team-in-cave

జూన్ 23న కోచ్ తో సహా 12 మంది చిన్నారుల ఫుట్ బాల్ టీం.. గుహను చూడడానికి వెళ్లారు. లోపలికి వెళ్లిన తర్వాత భారీ వర్షాలు కురవడంతో గుహలో భారీ వరదలు, బురద కూరుకుపోయి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ అధికారులు కనిపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుహలో బురద, నీటి మట్టం పెరగడంతో వారిని బయటికి తీసుకురావడానికి అధికారులకు కష్టతరంగా మారింది. 19 మంది డ్రైవర్ల కృషితో 18 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులను బయటికి తీసుకువచ్చి, ఆ చిన్నారుల తల్లిదండ్రులలో సంతోషాన్ని నింపారు. రెస్క్యూ అధికారుల చేసిన సాహసం మీరు చూడండి.. వారి సాహసాని నెటిజన్లు సాహో అంటున్నారు.

- Advertisement -