మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికను కలిసి పంచుకున్నారు ఠాక్రే బ్రదర్స్. ముంబైలో జరిగిన ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ ఇందుకు వేదికైంది.ర్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు.మహారాష్ట్ర మంత్రివర్గం త్రిభాషా విధానానికి సంబంధించి తీసుకున్న ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో, ఈ కార్యక్రమం ప్రతిపక్ష విజయాన్ని సూచిస్తూ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమ విద్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుదారి పడుతోందని అన్నారు. దక్షిణ భారతదేశ నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదివినా, తమ మాతృభాషలపై గౌరవం చూపుతున్నారని అన్నారు.
హిందీ భాషకు వ్యతిరేకత లేనప్పటికీ, దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తాము సమర్థించబోమని చెప్పారు. అంతేకాదు, మరాఠా సామ్రాజ్యం విస్తరించినప్పటికీ భాషను ఎవరిపై రుద్దలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఐక్యత కోసం ఇకపై తాము ఒకటిగా ఉంటామని స్పష్టం చేశారు.
Also Read:తరుణ్ భాస్కర్..’ఓం శాంతి శాంతి శాంతిః’
బెంగాల్, తమిళనాడులో హిందీ అమలుకు ప్రయత్నిస్తారా? అని సవాల్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రాష్ట్రంలో హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తున్నదని ..బయట ఇలా చేసే ఒక మరాఠీని నాకు చూపించు అన్నారు. ఏ భాషకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఏదైనా భాషను బలవంతం చేస్తే మా శక్తిని చూపిస్తామని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.

