TGSRTC..ఇన్నోవేటివ్ థింకింగ్

6
- Advertisement -

తెలంగాణ ఆర్టీసీ ఇన్నోవేటివ్ థింకింగ్ చేసింది. ఆర్టీసీ బస్సులు షెడ్యూల్ చేసేందుకు ఏఐని వాడనుంది తెలంగాణ ప్రభుత్వం . పండుగలకు, సెలవులకు ఏ మార్గంలో ఎన్ని బస్సులు నడపాలో నిర్ణయించనుంది ఏఐ.

ఆర్టీసీ బస్సుల షెడ్యూల్‌ను అధికారులు నిర్ణయించడం వల్ల పలు మార్గాల్లో బస్సులు సరిపోక, మరికొన్ని మార్గాల్లో బస్సులు ఎక్కువ అవుతున్నాయని ఏఐ సహాయం తీసుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర రవాణాశాఖ.

ఏ సమయంలో ఏ డిపోకు ఎన్ని బస్సులు నడపాలో ఏఐ సహాయంతో నిర్ణయించనున్నారు అధికారులు. అదేవిధంగా ఏ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు ఎక్కువగా సెలవులు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారనే వివరాలు కూడా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేయనుంది ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని పైలెట్ ప్రాజెక్టుగా మొదట ఆరు డిపోల్లో ప్రారంభించనుంది రవాణాశాఖ.

Also Read:Asia Cup: ఫైనల్‌కి టీమిండియా

- Advertisement -