Asia Cup: ఫైనల్‌కి టీమిండియా

27
- Advertisement -

ఆసియా కప్ 2025లో భాగంగా ఫైనల్‌కి దూసుకెళ్లింది టీమిండియా.బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 169 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా కేవలం 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో సైఫ్ హస్సన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బంతుల్లో 69 రన్స్ చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో బంగ్లా ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు.ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గిల్ 29, పాండ్యా 38 పరుగులు చేయడంతో భారత్ 168 పరుగులు చేసింది.

బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేస్ 2 వికెట్లు తీశాడు. సకీబ్, రెహ్మాన్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు. భారత్ గెలుపుతో ఈ టోర్నీ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ కి వెళ్లేందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు అవకాశాలు ఉన్నాయి.

Also Read:రెడ్‌బుక్‌కు పోటీగా డిజిటల్ బుక్!

- Advertisement -