ఆర్టీసీ ఛార్జీల పెంపుపై స్పందించిన సజ్జనార్

6
- Advertisement -

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఛార్జీల పెంపుపై స్పందించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఛార్జీల పెంపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని…జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించాం అని తెలిపారు.

ఈ మేరకు లేఖను విడుదల చేసిన సజ్జనార్…రెగ్యులర్ సర్వీస్ ల టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు అన్నారు. స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిందన్నారు.

పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని చెప్పారు.

Also Read:జమ్మూలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

- Advertisement -