మంగళవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నూతన కమిటీ ఏర్పాటు కాబడిన సందర్భంగా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్బంగా నూతనంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లా TGO కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావును, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మేడ్చల్ జిల్లాకు చెందిన ఆర్. శ్రీనివాసమూర్తిని, ఇతర కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. సహకార శాఖ అధికారులు సహకార సంఘాలు మరింత బలోపేతమైయేందుకు కృషి చేయాలనీ ఆయన కోరారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నందున సహకార సంఘాలు బ్యాంకుల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలను అందించేందు కృషి చేయాలనీ మంత్రి అధికారులను కోరారు.
మంత్రిని కలిసిన వారిలో నాగేశ్వర్ రావు,సత్యనారాయణ రెడ్డి,గంధం శ్రీనివాసరావు,ఈగ వెంకటేశ్వర్లు,ఆనంద రావు, నాగ నారాయణ, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస రాజు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.