- Advertisement -
కాలినడక భక్తుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రక్షణ కోసం నడక మార్గానికి ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇందుకోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని సూచించింది.
ఈ నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో ఈ అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు చర్చించి త్వరలో ఒక నిర్ణయానికి రానున్నారు.
రెండు సంవత్సరాల క్రితం అలిపిరి మెట్ల మార్గంలో ఒక చిన్నారిని చిరుతపులి చంపి తిన్న విషాద ఘటన తర్వాత నడక మార్గంలో కంచె ఏర్పాటు చేయాలని భక్తులు, నిపుణులు సూచించారు. అయితే అప్పటి టీటీడీ పాలకమండలి దీనిపై చర్యలు చేపట్టాలనుకున్నప్పటికీ, వన్యప్రాణి చట్టం అనుమతించకపోవడంతో ఆ ఆలోచనకు బ్రేక్ పడింది.
Also Read:గంగమ్మ ఒడికి మహాగణపతి
- Advertisement -

