TG:గ్రూప్-2 నియామకాలపై కీలక తీర్పు

7
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 నియామకాలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. ఈ నియామకాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాల ప్రక్రియలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, ఆ నియామకాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో నియామకం పొందిన అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.

అభ్యర్థుల పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడం వల్ల, గ్రూప్-2 పోస్టుల్లో నియామకమైన అభ్యర్థులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Also Read:యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం..మోదీ హర్షం

- Advertisement -