BB9:కెప్టెన్సీ టాస్క్‌ కోసం పోరు!

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ 9లో చివరి కెప్టెన్ ఎవరు అవుతారో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం కెప్టెన్సీ రేసులో నిలవాలంటే, హౌస్‌మేట్స్ హౌస్‌లోకి ప్రత్యేకంగా వచ్చిన ఎక్స్-కంటెస్టెంట్లను టాస్కుల్లో ఓడించాల్సి ఉంది. ఇప్పటికే ప్రియాంక జైన్‌ను ఓడించి కళ్యాణ్ కంటెండర్‌గా మారగా, ఈరోజు ఎపిసోడ్‌లో మరో ముగ్గురు ఎక్స్-కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.

మొదటగా సీజన్–8 ఫైనలిస్ట్ ప్రేరణ హౌస్‌లోకి వచ్చింది. ఆమె ఇచ్చిన ‘క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్, రూల్ ఇట్’ టాస్క్‌కు ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తుండగా, తనూజ ఆమెను బాగా బతిమాలింది. “నువ్వు టఫ్ ప్లేయర్‌వి… నేను నీతోనే ఆడాలి” అంటూ తనూజ కోరడంతో, ప్రేరణ ఆమెతోనే ఆడేందుకు అంగీకరించింది. అయితే టాస్క్ మొదలైన తర్వాత ప్రేరణ తన అనుభవాన్ని చూపుతూ సులభంగా తాడుపై నుంచి క్రాస్ చేస్తూ బాల్స్‌ను హోల్‌లో పడేసింది. తనూజ ఎంత కష్టపడ్డా, గెలుపు ప్రేరణదే. దీంతో తనూజ కెప్టెన్సీ రేసు నుండి బయటపడింది.

తర్వాత సీజన్–4 కంటెస్టెంట్ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. తనతో ఆడేందుకు ఆమె సుమన్ శెట్టికి చాన్స్ ఇచ్చింది. టవర్ నిర్మించాల్సిన ఈ టాస్క్‌లో హారిక కావాలనే సుమన్ గెలవాలని ప్రయత్నించినా, అతను టెన్షన్‌తో తప్పులు చేసి చివరకు ఓడిపోయాడు. దీంతో సుమన్ రేసు నుండి బయటకు వెళ్లిపోయాడు.

ఇక మరోవైపు సంజన ఈ వారం కెమెరాలకు ఎక్కువగా కనిపించాలనే ఉద్దేశంతో రకరకాల స్టంట్లు చేస్తూ వచ్చింది. ఈ రోజు భరణి మినరల్ ట్యాబ్లెట్లు తీసి దాచేసి, “నన్ను పెద్దగా కనిపించడం లేదన్నావు కదా… ఇప్పుడే చూపిస్తా” అంటూ కెమెరాకు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఎపిసోడ్ చివర్లో సీజన్–4 ఫేమ్ మానస్ నాగులపల్లి వచ్చి హౌస్ వాతావరణాన్ని కాస్త జోష్‌కి తెచ్చాడు. తర్వాత ‘నైల్ ఇట్, విన్ ఇట్’ టాస్క్‌ను డీమాన్ పవన్తో ఆడించాడు. ఇరువురూ బలంగా పోటీపడ్డా, చివరికి డీమాన్ ఆధిపత్యం చూపించి గెలిచాడు. దీంతో అతను రెండో కంటెండర్‌గా నిలిచాడు.

Also Read:యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం..మోదీ హర్షం

ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెండర్లు కళ్యాణ్, డీమాన్ మాత్రమే. రేపటి ఎపిసోడ్‌లో ఇంకెవరైనా కంటెండర్‌గా నిలుస్తారా అనేది ఆసక్తికరం. అనంతరం శుక్రవారం ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ జరగనుంది.

- Advertisement -